అధ్యయనం, ధ్యానం మరియు స్ఫూర్తి కోసం మీ డిజిటల్ సహవాసి
ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి తోడ్పడే ఒక డిజిటల్ సాధనం
ఆధ్యాత్మిక మహాగ్రంథమైన ఒక యోగి ఆత్మకథ యొక్క రచయిత అయిన పరమహంస యోగానందగారి బోధనల ద్వారా ఆత్మ యొక్క శాంతి, ఆనందం మరియు వివేకం యొక్క జీవన పరివర్తనకారకమైన జాగృతిని అనుభూతి చెందండి.
మీరు పరమహంస యోగానందగారి బోధనలకు పూర్తిగా కొత్తవారైనా, లేక ఆ మహాగురువుల బోధనలలో దశాబ్దాలుగా నిమగ్నమైనవారైనా — ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ అందరి కోసం ఉద్దేశించబడింది. అంతేకాక ఇది ధ్యానం, క్రియాయోగ విజ్ఞానం, మరియు ఆధ్యాత్మికంగా సంతులితమైన జీవితాన్ని గడపడానికి ఆచరణయోగ్యమైన మార్గాలపై ఆసక్తి ఉన్న ఎవరికైనా ఉపయుక్తమైనది.
ముఖ్యాంశాలు:
- శాంతి, నిర్భయంగా జీవించడం, కాంతి రూపంలో భగవంతుడు, చైతన్యం యొక్క వ్యాప్తి ఇత్యాది ఎన్నో అంశాలపై నిర్దేశిత ధ్యానాలు — ఈ ధ్యానాలు 15 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు మీ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి.
- ఆన్‌లైన్ ధ్యానాల ప్రత్యక్షప్రసారానికి ఉచిత ప్రవేశం
- వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. వార్తలు మరియు కార్యక్రమాల వివరాలు
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విద్యార్థులకు...
ఈ యాప్ వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల యొక్క డిజిటల్ ప్రతిరూపాలతో పాటు, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. బోధనలను మీ దైనందిన జీవితంలో వినియోగించుకోవడానికి తోడ్పడే అనేక మల్టీమీడియా అంశాలను కూడా కలిగి ఉంటుంది.
ఇందులోని ముఖ్యాంశాలు:
- పరమహంస యోగానంద గారి ఆడియో రికార్డింగులు
- వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు నిర్వహించే నిర్దేశిత ధ్యానాలు
- వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ధ్యానప్రక్రియలపై పాఠాలు
- వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. శక్తిపూరణ వ్యాయామాలపై దశలవారీ సూచనలు
మీరు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల విద్యార్థి అయినట్లయితే, ఈ యాప్ లో పాఠాలను చదువుకోవడానికి మీ నిరూపిత సభ్యత్వ వివరాలను ఉపయోగించండి.
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురించి వివరాలు
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) సంస్థలు, ఆత్మను కనుగొనే జీవనపరివర్తనకారక యాత్రలో కలసి ప్రయాణించమని ఆధ్యాత్మిక అన్వేషకులకు అందించే ఒక ఆహ్వానం. ఈ ప్రయాణం పరమహంస యోగానంద గారి “జీవించడం ఎలా” బోధనలను అవలంబిస్తుంది – ఈ బోధనలు, మనం నిజంగా ఎవరమో తెలియజేసే అత్యున్నతమైన ప్రక్రియలను కలిగి ఉండి, మన జీవితాలలోను మరియు ఈ ప్రపంచంలోను శాశ్వతమైన శాంతిని, ఆనందాన్ని, ప్రేమను ఎలా తీసుకొనిరావాలో చూపిస్తాయి. వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్.ల లక్ష్యం కేవలం ఒక సిద్ధాంతపరమైన పాఠ్యక్రమాన్ని అందించడమే కాదు – ఇది ఆధునిక యుగంలోని ఆధ్యాత్మిక మహాగురువులలో ఒకరి సజీవసందేశం ద్వారా దివ్యజ్ఞానాన్ని నిజంగా ప్రసారం చేయడం.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా 1917లో పరమహంస యోగానందగారి ద్వారా స్థాపించబడింది. ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగ బోధనలను వ్యాప్తి చేసేందుకు పరమహంస యోగానందగారిచే సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ 1920లో స్థాపించబడింది.
ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ యొక్క ముఖ్యాంశాలు
ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ ద్వారా వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులు, తమ స్వంత డివోటీ పోర్టల్ వివరాలను ఉపయోగించి లాగిన్ అయ్యి, తాము ఎంచుకున్న భాషలలో పాఠాలను చదువుకోవచ్చు. ఈ యాప్ యొక్క వినియోగదారులందరూ, పాఠాల విద్యార్థులయినా కాకపోయినా కూడా – ఆన్‌లైన్ ధ్యానాలు, నిర్దేశిత ధ్యానాలు, వై.ఎస్.ఎస్. వార్తలు మరియు బ్లాగ్ పోస్టుల వంటి ఇతర డిజిటల్ అంశాలను వినియోగించుకోవచ్చు.
పాఠాల యొక్క డిజిటల్ ప్రతిరూపం ముద్రిత పాఠాలకు అదనంగా అందించబడుతుంది కాని, దానికి ప్రత్యామ్నాయంగా కాదు. ముద్రిత పాఠాలతో కలిపి, విచక్షణతో ఉపయోగించినప్పుడు, పాఠాల డిజిటల్ రూపం విద్యార్థులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వై.ఎస్.ఎస్. పాఠాలలో అంతర్లీనంగా ఉన్న సత్యాలను మరియు దివ్యచైతన్యాన్ని అధ్యయనం చేసి, వాటిని ఆకళింపు చేసుకుని, వాటి ద్వారా ఆధ్యాత్మికంగా పరివర్తన చెందేందుకు మీకు ఏ పద్ధతి అత్యంత అనువుగా ఉంటుందో, దానిని విచక్షణతో ఎంచుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.
ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ లోని కొన్ని ముఖ్యాంశాలు::
- పాఠాలను, ఎన్నో మెరుగైన అంశాలు గల కొత్త ఈ-రీడర్ లో చదువుకోండి; అందులో కొన్ని: పుస్తకవాక్యాలను (టెక్స్ట్) మాట (స్పీచ్) లోకి మార్చి చదివే సామర్థ్యం, ఫోన్/టాబ్లెట్ ను నిలువుగానే కాక అడ్డంగా కూడా పెట్టుకుని చదవగలిగే సౌలభ్యం (ల్యాండ్-స్కేప్ రీడింగ్), వివిధ రంగులలో హైలైట్ చేసుకునే సౌలభ్యం, పదాల అర్థాలను వెతుక్కునే సామర్థ్యం (వర్డ్ లుకప్), ఫ్లాష్-కార్డులను తయారు చేసుకునే సౌలభ్యం, మొదలైన ఎన్నో అంశాలు!
- మీ ప్రత్యేకమైన అవసరాలు మరియు ఆసక్తులను బట్టి, వాటిపై మార్గనిర్దేశాన్ని సులభంగా చేరుకోవడానికి విషయాంశాల (టాపిక్) వారీగా అనుబంధ (సప్లిమెంట్) పాఠాలను బ్రౌజ్ చేయండి.
- study.staging4.yssofindia.org ద్వారా(కంప్యూటర్ పై), మా డెస్క్ టాప్ బ్రౌజర్ రీడర్ ను ఉపయోగించండి – ఇది మీ మొబైల్ యాప్ నుంచి మీరు చదువుతున్న స్థానాన్ని (పేజీని), సేవ్ చేసుకున్నబుక్-మార్క్ లను, మీరు హైలైట్ చేసి పెట్టుకున్న భాగాలను దానంతట అదే డెస్క్-టాప్ బ్రౌజర్ లోకి తీసుకొని వస్తుంది.
- వై.ఎస్.ఎస్ నుంచి సరికొత్త వార్తలు మరియు బ్లాగ్ కథనాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి.
- యాప్ నుంచి దైనందిన ఆన్‌లైన్ ధ్యానాలలో నేరుగా పాల్గొనండి.
- వివిధ అంశాలపై నిర్దేశిత ధ్యానాల అనుభూతిని పొందండి – ఇవి ఇప్పుడు మీ కార్యక్రమాలకు అనుగుణంగా, వివిధ వ్యవధులలో అందించబడుతున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు
దిగువ FAQలు (తరచుగా అడిగే ప్రశ్నలు) ప్రత్యేకంగా వై.ఎస్.ఎస్. యాప్ కి సంబంధించినవి. మీరు వై.ఎస్.ఎస్. మరియు ఈ బోధనల కోసం సాధారణ FAQ (తరచుగా అడిగే ప్రశ్నలు) కోసం చూస్తున్నట్లయితే, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
యాప్ పనిచేసే డివైస్ లు మరియు భాషలు
ఏ రకమైన పరికరాలు ఉపయుక్తంగా ఉంటాయి?
యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ ఫారమ్ లలో అందించబడింది. డెస్క్ టాప్ బ్రౌజర్‌లలో కూడా పాఠాలు అందుబాటులో ఉన్నాయి.
- ఆండ్రాయిడ్ యాప్ కి అయితే:
- ఆండ్రాయిడ్ వెర్షన్ 7.0 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న డివైజ్ కావాలి
- Google Play Store మరియు Google Play సేవలు పరికరంలో ఇన్ స్టాల్ చేయబడి ఉండాలి.
- iOS యాప్ కి అయితే :
- iOS వెర్షన్ 17.4 మరియు అంతకంటే ఎక్కువ ఉండాలి
- డెస్క్ టాప్ బ్రౌజర్ అయితే :
- అన్ని ప్రధాన బ్రౌజర్‌లు: Chrome, Safari, Firefox, Microsoft Edge ఏవైనా ఫర్వాలేదు
ప్రస్తుతానికి ఈ క్రింది పరికరాలు ఉపయోగపడవు :
- అమెజాన్ ఫైర్ టాబ్లెట్ లు
- ఆండ్రాయిడ్ ఇన్స్టంట్ యాప్ లు
- గూగుల్ క్రోమ్ బుక్ యాప్ లు
నేను నా కంప్యూటర్ లేదా విండోస్ పరికరంలో పాఠాలను చదవవచ్చా?
అవును! విద్యార్థులు ఇప్పుడు study.staging4.yssofindia.orgకి వెళ్ళి వారి డీవోటీ పోర్టల్ (Devotee portal) వివరాల ఆధారంగా లాగిన్ చేయడం ద్వారా వారి కంప్యూటర్‌లలో వారి పాఠాలను యాక్సెస్ చేయవచ్చు.
ఏఏ భాషలలో అందుబాటులో ఉంది?
అప్లికేషన్ (యాప్) భాష: ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది. యూజర్ ఇంటర్ ఫేస్ మరియు పాఠ్యేతర అంశాలను మీరు కోరుకున్న భాషలో వీక్షించడానికి, దయచేసి ‘నా కోసం’ (For me) విభాగంలో యాప్ భాష (App Language) ను ఎంచుకోండి. పాఠ్యేతర విషయాలైన వార్తల పోస్ట్ లు, ఆయా భాషలలో జరిగే ఆన్‌లైన్ ధ్యాన తరగతుల వివరాలు, నిర్దేశిత ధ్యానాలు, ప్రతి వారం సత్సంగాలు, గీతా ప్రసంగాలు, సంగమాలు మరియు సమ్మేళనాల నుండి సత్సంగాలతో కూడి ఉంటుంది.
పాఠాల భాష: యాప్ లోని వై.ఎస్.ఎస్. పాఠాలు ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో అందించబడుతున్నాయి. ఏదైనా భాషలో వీక్షించడానికి, ఒకరు ముందుగా పాఠాల విద్యార్థిగా నమోదు చేసుకోవాలి (దయచేసి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి). ‘నా కోసం (For me)’ విభాగానికి వెళ్ళి, ‘పాఠాల భాష (Lessons Language)’ ని ఎంచుకోవడం ద్వారా యాప్ లో పాఠాల భాషను ఎంపిక చేసుకోవచ్చు.
పాఠాల నమోదు, లాగిన్ చేయడం, అతిథి పద్ధతి (Guest Mode)
నేను యాప్ లో నా పాఠాలను యాక్సెస్ చేయలేకపోతున్నానెందుకు?
- లాగిన్ చెయ్యడానికి, విషయాన్ని యాక్సెస్ చేయడానికి మీరు ఆన్‌లైన్ లో ఉన్నారో, లేదో నిర్ధారించుకోండి.
- మీరు యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న నిర్దిష్ట సిరీస్ కోసం మీరు నమోదు చేసుకున్నారో, లేదో నిర్ధారించుకోండి. ప్రాథమిక తరగతులకు, తదనంతర తరగతులకు వేర్వేరుగా నమోదు చేసుకోవాలి.
- ఈ యాప్, పాఠాల కొత్త ఎడిషన్ కు మాత్రమే యాక్సెస్ ఇస్తుంది. మీరు పాఠాల కొత్త ఎడిషన్ కు సభ్యత్వం పొందకపోతే, దయచేసి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ సందర్శించండి.
- మీరు మీ పాస్‌వర్డ్ ను మరచిపోయినట్లయితే, మీ పాస్‌వర్డ్ ని రీసెట్ చేయడానికి లాగిన్ స్క్రీన్ పై ‘పాస్‌వర్డ్ మర్చిపోయారా? (Forgot Password?)’ని క్లిక్ చేయండి.
- మీకు ఇంకా సమస్య ఉంటే, దయచేసి మా హెల్ప్ డెస్క్ ని సంప్రదించడానికి యాప్ యొక్క ‘నా కోసం (For Me)’ పేజీలోని ‘మద్దతు (Support)’ బటన్ ను ఉపయోగించండి. దీనివల్ల మీకు మరింత సహాయం అందించటానికి మాకు వీలవుతుంది. మీరు యాప్ ను ఇన్ స్టాల్ చేయలేకపోతే, దయచేసి apptechsupport@yogananda-srf.orgకు ఇమెయిల్ చేయండి. మెయిల్ లో మీ సమస్యను స్పష్టంగా వివరించండి. దయచేసి మీ పేరు మరియు మీ ఖాతాతో అనుసంధానించబడిన ఇమెయిల్ చిరునామాను చేర్చాలని గుర్తుంచుకోండి.
నేను యాప్‌లోని పాఠాలను ఎప్పుడు యాక్సెస్ చేయగలను?
యాప్ లో నిర్దిష్ట పాఠం ఇంకా అందుబాటులో లేకుంటే, అది లభ్యమయ్యే తేదీ చూపబడుతుంది.
నేను ఇంగ్లీష్ మరియు హిందీ (లేదా తమిళం/తెలుగు) పాఠాలకు సభ్యత్వం పొందాను. కానీ ఇంగ్లీష్ పాఠాలను మాత్రమే చూడగలుగుతున్నాను. నేను నా హిందీ (లేదా తమిళం/తెలుగు) పాఠాలను ఎలా చూడగలను?
పాఠాల భాష (Lessons Language) విభాగాన్ని చూడండి.
యాప్ లోని వివిధ లక్షణాలను, సౌకర్యాలను అర్థం చేసుకోవడం మరియు సమస్యలను పరిష్కరించుకోవడం
పాఠాలు చదవడం కోసం ఈ-రీడర్ (eReader)
గుర్తుంచుకోదగిన అంశాలు, ముఖ్యాంశాలు
పాఠంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలను ఎంచుకుని 4 విభిన్న రంగుల్లో హైలైట్ చేసుకోవచ్చు. రెండు కంటే ఎక్కువ పదాలను గనుక మీరు ఎంపిక చేసుకుంటే, మీరు చివరిగా ఉపయోగించిన రంగుతో మీ ఎంపికను యాప్ స్వయంచాలకంగా హైలైట్ చేస్తుంది. మీరు ఎంపిక చేసుకున్న విషయాలు (BOOKMARKS), ప్రస్తుత పాఠంలోని ముఖ్యాంశాలు ఇన్-రీడర్ మెనూలో కనిపిస్తాయి (ఎగువన కుడివైపున ఉన్న మెనూ చిహ్నాన్ని క్లిక్ చేయండి). అన్ని పాఠాల నుండి మీరు ఎంపిక చేసుకున్న విషయాలు (BOOKMARKS), ముఖ్యాంశాలను వీక్షించడానికి, ‘నా కోసం (FOR ME)’ విభాగానికి వెళ్ళి, ‘ఎంపిక చేసుకున్న విషయాలు (BOOKMARKS) మరియు ముఖ్యాంశాలు’ ఎంచుకోండి. మీ అన్ని ఎంపిక చేసుకున్న విషయాలు (BOOKMARKS), ముఖ్యాంశాలు మీ వివిధ పరికరాలలో ఎప్పటికప్పుడు సింక్ అవుతాయి.
పాఠాల సహాయక సమాచారాన్ని యాక్సెస్ చేయడం
నిర్దిష్ట పాఠం యొక్క ల్యాండింగ్ పేజీలో ‘సహాయక సమాచారం (Auxiliary Materials)’ బటన్ పై క్లిక్ చేయండి. దయచేసి “అవలోకనం,” “స్వీయ-సాక్షాత్కారం ద్వారా అత్యధిక విజయాలు” మరియు “ముందుమాట”లో సహాయక సమాచారం లేదని గమనించండి. 1వ పాఠం నుంచి సహాయక సమాచారం అందుబాటులో ఉంది.
పద శోధన (వై.ఎస్.ఎస్. పదకోశం మరియు నిఘంటువు నుండి)
eReaderలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలను ఎంచుకుని, దిగువ మెనులో ‘మరింత తెలుసుకోండి (Learn More)’ ని క్లిక్ చేయండి. ఇది వై.ఎస్.ఎస్. పదకోశం మరియు ప్రామాణిక నిఘంటువు రెండింటి నుండి నిర్వచనాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. అనేక పదాలను ఎంపిక చేస్తే, ఎంపిక చేసిన అన్ని పదాల యొక్క వివరాలను యాప్ అందిస్తుంది. నిఘంటువు ఫలితాల కోసం, దయచేసి ఒకసారి ఒక పదాన్ని మాత్రమే ఎంచుకోండి.
ఫ్లాష్ కార్డ్ లు (సృష్టించడం మరియు సమీక్షించడం)
ఫ్లాష్ కార్డ్ ల సృష్టి ఇప్పుడు కొత్త భావనలను నేర్చుకోవడానికి ఒక సాధనంగా అందుబాటులో ఉంది. ఫ్లాష్ కార్డ్ ని సృష్టించడానికి, eReader నుండి ఒక పదబంధాన్ని ఎంచుకోండి (ఇది పదబంధాన్ని హైలైట్ చేస్తుంది). ఆపై హైలైట్ చేసిన విభాగాన్ని మళ్ళీ క్లిక్ చేసి, దిగువ మెనులో ‘ఫ్లాష్ కార్డ్ ని సృష్టించు (Create flashcard)’ ని క్లిక్ చేయండి. ఇది మీ ఫ్లాష్ కార్డ్ యొక్క “నిర్వచనాన్ని” సెట్ చేస్తుంది. సృష్టిని పూర్తి చేయడానికి ‘శీర్షిక (Title)’ ను అందించి, రంగును ఎంచుకోండి. సేవ్ చేసిన అన్ని ఫ్లాష్ కార్డ్ లు యాప్ లోని ‘నా కోసం (FOR ME)’ విభాగంలో కనిపిస్తాయి.
టెక్స్ట్-టు-స్పీచ్ (TTS) పని చేయడం లేదు
టెక్స్ట్-టు-స్పీచ్ (TTS) కొన్ని పరికరాలలో మాత్రమే పని చేస్తుంది. భాషని బట్టి కూడా మద్దతు మారుతుంది. ఉదాహరణకు తమిళంలో TTSకి iOSలో మద్దతు లేదు.
నిర్దిష్ట ఆండ్రాయిడ్ పరికరాలలో (Samsung పరికరాలు వంటివి), డిఫాల్ట్ (లేదా ప్రాధాన్యమైనదిగా) స్పీచ్ ఇంజిన్‌ను ‘Google ద్వారా స్పీచ్ సర్వీసెస్’కి సెట్ చేయండి.
TTS మాట్లాడే స్వరాన్ని మార్చడం
లిజనింగ్ మోడ్ లో ఉన్నప్పుడు, ఆడియో ప్లేయర్ మెనులో దిగువన ఎడమ మూలలో ఉన్న ప్రసంగ (Speech) చిహ్నాన్ని క్లిక్ చేయండి. ఇది మీ పరికరంలో అందుబాటులో ఉన్న అన్ని స్వరాలను జాబితా చేస్తుంది.
మాడ్యూల్ ద్వారా అనుబంధ పాఠాలను బ్రౌజ్ చేయడం (అంశం వారీగా)
ప్రాథమిక పాఠ్య శ్రేణి (పాఠాలు 1–18) పూర్తి చేసిన విద్యార్థులు తదనంతర (అనుబంధ) సిరీస్ కు నమోదు చేసుకోవడానికి అర్హులు. టాపిక్ వారీగా అనుబంధ పాఠాలను బ్రౌజ్ చేయడానికి ‘అనుబంధ పాఠాలు (Supplement Lessons)’ ట్యాబ్ ని ఎంచుకుని, ‘మాడ్యూల్స్’ పై క్లిక్ చేయండి. మీరు అనుబంధ శ్రేణి ప్రారంభించిన తర్వాత, ప్రతి రెండు వారాలకు ఒకసారి కొత్త పాఠాలు అందుబాటులోకి వస్తాయి.
ఆన్‌లైన్ ధ్యానాలు
ప్రత్యక్ష ఆన్‌లైన్ ధ్యానాలలో పాల్గొనడం
యాప్ లోని ‘ధ్యానం | ఆన్‌లైన్’ (‘Meditate | Online’) విభాగంలో రాబోయే ధ్యానాలు జాబితా చేయబడతాయి. నిర్దిష్ట ప్రారంభ సమయం వచ్చినప్పుడు, మీరు జూమ్ (Zoom) లేదా యూట్యూబ్ (YouTube) ద్వారా ధ్యానంలో చేరవచ్చు. ‘జాయిన్ ఆన్’ బటన్ ను క్లిక్ చేస్తే తగిన యాప్ లాంచ్ అవుతుంది (ముందు ఇన్‌స్టాలేషన్ అవసరం).
ఆన్‌లైన్ ధ్యాన జాబితాను ఫిల్టర్ చెయ్యడం (జాబితాలో మనకు కావలసిన దానిని ఎంపిక చేసుకోవడం/వెతుక్కోవడం)
మా ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం వివిధ రకాల కార్యక్రమాలను అందిస్తుంది. మీరు నిర్దిష్ట రకాలను వీక్షించడానికి/చేరడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు ఎగువన కుడి వైపున ఉన్న ‘ఫిల్టర్’ చిహ్నాన్ని క్లిక్ చేసి, వీక్షించటానికి మీకు ఆసక్తి ఉన్న రకాలను మాత్రమే తనిఖీ చేయవచ్చు. మీ మార్పులను సేవ్ చేయడానికి ‘వర్తించు/వినియోగించు (Apply)’ క్లిక్ చేయండి.
నిర్దిష్ట/ ఎంచుకున్న భాషలో ఆన్‌లైన్ ధ్యాన షెడ్యూళ్ళను వీక్షించడం
మీ పరికర భాష (Device language) ను కావలసిన భాషకు సెట్ చేసుకున్నప్పుడు యాప్ మరిన్ని భాషలలో కార్యక్రమాలను చూపుతుంది. అయితే ప్రస్తుతం ఇది హిందీ, తమిళం మరియు తెలుగులో మాత్రమే అందుబాటులో ఉంది.
నిర్దేశిత ధ్యానాలు
నిర్దేశిత ధ్యానాలను చూడడం
యాప్ లోని ‘ధ్యానం | గైడెడ్’ విభాగం ద్వారా మీరు మా సన్యాసుల నేతృత్వంలోని నిర్దేశిత ధ్యానాలను అనుసరించవచ్చు. మొదట అంశాన్ని (Topic)ని ఎంచుకుని, ఆపై ప్రారంభించడానికి కావలసిన వ్యవధిని ఎంచుకోండి. వై.ఎస్.ఎస్. వేదికను వీక్షించడానికి మీ మొబైల్ పరికరాన్ని ల్యాండ్ స్కేప్ మోడ్ లోకి మార్చుకోండి.
నిర్దేశిత ధ్యానాలను డౌన్‌లోడ్ చేసుకోవడం
మీరు ఆఫ్ లైన్ లోనో లేదా ధ్యానాన్ని పునరావృతం చెయ్యడానికో నిర్దిష్ట ధ్యానాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే, ప్లేయర్ కు కుడి వైపు దిగువన ఉన్న ‘డౌన్‌లోడ్’ చిహ్నాన్ని క్లిక్ చేయండి. మీరు మళ్ళీ అదే ధ్యానానికి తిరిగి వచ్చినప్పుడు, డౌన్‌లోడ్ చేయబడిన ఫైల్ ఉపయోగపడుతుంది.
ఇతర భాషలలో నిర్దేశిత ధ్యానాలు
నిర్దేశిత ధ్యానాలు హిందీ, తమిళం, మరియు తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ధ్యానాలను చేయడానికి, అలాగే వార్తల పోస్ట్ లు, నిర్దిష్ట భాషలో ఆన్‌లైన్ ధ్యాన షెడ్యూళ్ళ వంటి అన్ని ఇతర పాఠ్యేతర విషయాలను చూడడానికి, దయచేసి మీ ‘యాప్ భాష (App Language)’ను హిందీ, తమిళం, లేదా తెలుగుకి మార్చండి.
ఇంకా ఏమైనా సహాయం కావాలా?
మీ ప్రశ్నకు సమాధానం దొరకలేదా? సహాయం కోసం మమ్మల్ని సంప్రదించండి.
మా అంతర్జాతీయ స్వచ్ఛంద హెల్ప్ డెస్క్ ద్వారా మద్దతు పొందండి:
యాప్‌లోని ‘నా కోసం (FOR ME)’ విభాగంలో, దయచేసి ‘మద్దతు (SUPPORT)’ పై క్లిక్ చేయండి. మా హెల్ప్ డెస్క్ తో టికెట్ ను రూపొందించడానికి కోరిన సమాచారాన్ని పూరించండి. సమస్య గురించి మీరు ఎంత ఎక్కువ వివరాలను అందించగలిగితే, మేము అంత త్వరగా, సమర్థవంతంగా ప్రతిస్పందించడం సులభం అవుతుంది.
మీరు సపోర్ట్ స్క్రీన్ ని యాక్సెస్ చేయడానికి యాప్ ను తెరవలేకపోతే, దయచేసి సమస్యను వివరంగా, మీ పరికరం యొక్క సమాచారం మరియు మీ విద్యార్థి ఖాతాతో అనుబంధించబడిన ఇమెయిల్ చిరునామాను వివరిస్తూ apptechsupport@yogananda-srf.orgకి ఇమెయిల్ పంపండి.
తాజాగా అభివృద్ధి చేయబడిన యాప్ కు ప్రశంసలు
ఈ అద్భుతమైన కొత్త యాప్ ని అభివృద్ధి చేసినందుకు చాలా ధన్యవాదాలు. నేను చాలా కార్యక్రమాల పట్ల పూర్తిగా ఆసక్తిగా ఉన్నాను. పాఠాలను చదవడం, ముఖ్యమైన విషయాలను హైలైట్ చేసుకోవడం, ఫ్లాష్ కార్డ్ లను రూపొందించుకోవడం ఎంతో బాగుంది. ఈ కొత్త యాప్ కారణంగా, నా దైనందిన జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడని నేను ఇప్పుడు భావిస్తున్నాను. కొద్దిపాటి విశ్రాంతి సమయంలో, నేను నా ఫ్లాష్ కార్డ్ లను త్వరగా చూడగలుగుతున్నాను. నా జీవితంలో ఏది ముఖ్యమైనదో, ప్రస్తుతానికి నేను దేనిపై దృష్టి పెట్టాలనుకుంటున్నానో గుర్తుంచుకోగలుగుతున్నాను. ఈ అనుగ్రహానికి నేను అనంతమైన కృతజ్ఞుడను!
ఈ రోజు మీకు ఈ ఈ-మెయిల్ పంపడం చాలా ఆనందంగా ఉంది. కొత్త SRF యాప్ ఇప్పుడు అంధులకు కూడా ఎలా అందుబాటులో ఉందో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ బహుమతిని చూసి నేను ఉప్పొంగిపోతున్నాను. "డాక్యుమెంట్ రీడర్" కంటే "స్క్రీన్ రీడర్" అవసరమయ్యే మనలోని చాలామందికి ఈ క్రొత్తగా రూపొందించబడిన యాప్ అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. దానివల్ల ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్న SRF/YSS కార్యక్రమాలను దృష్టి లోపం ఉన్న భక్తులు కూడా యాక్సెస్ చేయగలరు. ఎప్పటిలాగే, మన గురువుగారు చాలా ఉదారంగా మనం కోరిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. మన SRF కుటుంబం మన ఆకాంక్షలను ఆలకించి ప్రతిస్పందించడం పట్ల నేను అత్యంత గౌరవాన్ని ప్రకటిస్తున్నాను.
నేను యాప్ సమాచారాన్ని చూశాను. యాప్ ని అప్‌గ్రేడ్ చేయడం ఒక పెద్ద ముందడుగనే చెప్పాలి. అంతకముందు నుంచే నాకు అనేక ఆకాంక్షలు ఉన్నాయి — ల్యాండ్ స్కేప్ మోడ్, అధ్యయనం కోసం శోధించదగిన ముఖ్యాంశాలు (కానీ నా విస్తృతమైన ఆకాంక్షలకంటే ఇవి ఎంతో మెరుగైనవి), టెక్స్ట్ టూ స్పీచ్, మరియు ఇతర అన్ని లింక్ లు సౌకర్యవంతంగా ఉన్నాయి. నేను ఇతర విషయాల కంటే ఆ అధ్యయనానికే ఎక్కువ సమయం వినియోగించాను. ముఖ్యాంశాలనే నేను ఎక్కువగా శోధిస్తూ ఉంటాను. నేను ఇప్పుడు రంగుల ఆధారంగా విషయాలను వర్గీకరించవచ్చు, ఎంపిక చేసుకోవచ్చు. నాకు అవసరమైన, ప్రధానమైన ముఖ్యాంశాలకు ఒక రంగుకు అమర్చుకోవటానికి, ఎలాంటి అంతరాయం లేకుండా వాటిని ఒక జాబితాగా చూడటానికి నాకు ఈ యాప్ లో అవకాశం ఉంది! ఇది ఒక నిధి! నేను ఇన్ని సంవత్సరాలలో ఎన్నో యాప్ లను అప్ గ్రేడ్ చేశాను. కానీ SRF మాత్రం అత్యంత ఆకట్టుకునే రీతిలో మన ముందుకు వచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను. ధన్యవాదాలు!
కంప్యూటర్లో నా పాఠాలను ఇప్పుడు చదవగలుగుతున్నందుకు నేను చాలా కృతజ్ఞుడను. ప్రతిదీ చాలా అందంగా ప్రదర్శించబడింది. నేను ఈ సాంకేతికత ద్వారా లభించే అన్ని ఆశీస్సులనూ అందుకోవాడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాను!
కాబట్టి నేను ఇప్పుడు నాకు తెలిసిన SRF/YSS యాప్ ని తెరుస్తాను. నాకు సమాచారం వచ్చింది: కొత్త అప్డేట్ అందుబాటులో ఉంది. నేను యాప్ స్టోర్ లో "What's New" విభాగాన్ని చదవడం ప్రారంభించాను. ఈ కొత్త అప్డేట్ (వెర్షన్ 3.0.0) ను చూసి ఆశ్చర్యపోయాను. చాలా కొత్త ఫీచర్లు ఉన్నాయి!
నేను ఈ యాప్ యొక్క సరికొత్త సంస్కరణను నిజంగా ఇష్టపడుతున్నాను. ధ్యానం చేయడం, నేర్చుకోవడం, తోటి భక్తులతో కనెక్ట్ అవ్వడం, అలాగే SRF నుండి తాజా సమాచారాన్ని పొందడం వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
ఈ యాప్ అప్డేటెడ్ వెర్షన్ ఖచ్చితంగా అద్భుతమైనది. అన్ని విషయాలనూ ఒకే పేజీలో తీసుకురావడం నిజంగా అద్భుతం.
అప్డేట్ చేయబడిన యాప్ ను ఇష్టపడుతున్నాము. ముఖ్యంగా TTS [టెక్స్ట్-టు-స్పీచ్] ను!
ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్ ను పొందండి
Google Play లేదా Apple స్టోర్ నుండి యాప్ ను డౌన్‌లోడ్ చేయండి:
వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులు డెస్క్ టాప్ యాప్ లో వై.ఎస్.ఎస్. పాఠాలు మరియు సహాయక సమాచారాన్ని కూడా వీక్షించవచ్చు:

















