హరిద్వార్ కుంభమేళా — 2027

గురువారం, మార్చి 4, 2027 – గురువారం, ఏప్రిల్ 15, 2027

హరిద్వార్ కుంభమేళా 2027 — కార్యక్రమం యొక్క ముఖచిత్రం

ఈ కార్యక్రమానికి నమోదు (రిజిస్ట్రేషన్లు) మంగళవారం, డిసెంబర్ 1, 2026న ప్రారంభమవుతాయి.

ఈ కార్యక్రమం వివరాలు

చిరకాలంగా భారతదేశంలో జరిపే మతధార్మిక ఉత్సవాల్ని కుంభమేళా లంటారు; ఆధ్యాత్మిక లక్ష్యాల్ని అవి జనబాహుళ్యం దృష్టిలో ఎప్పుడూ నిలుపుతూ ఉంటాయి.

— పరమహంస యోగానంద

మన ప్రియమైన గురుదేవుల ఈ పలుకుల నుండి ప్రేరణ పొంది, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) కుంభమేళాల సమయంలో శిబిరాలను నిర్వహిస్తూ వస్తోంది. 2025లో మేము ప్రయాగరాజ్ కుంభమేళాలో ఒక శిబిరాన్ని నిర్వహించాము; దీనికి వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు అనేకమంది హాజరయ్యారు.

వై.ఎస్.ఎస్. 1992 నుండి హరిద్వార్‌లో ప్రతి కుంభమేళా మరియు అర్ధ కుంభమేళా సమయాలలో శిబిరాన్ని నిర్వహిస్తూ వస్తోంది (కోవిడ్ మహమ్మారి కారణంగా క్రితంసారి మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది). అదే విధంగా, 2027లో జరగబోయే హరిద్వార్ కుంభమేళాలో కూడా వై.ఎస్.ఎస్. శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మేము యోచిస్తున్నాము. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులందరికీ ఈ శిబిరానికి హాజరు కావడానికి స్వాగతం.

ఈ శిబిరం కుంభమేళా ప్రాంగణంలో 2027 మార్చి 4 నుండి ఏప్రిల్ 15 వరకు పనిచేస్తుంది. ఈ కాలంలో ఈ క్రింది స్నానపు రోజులు ఉంటాయి:

  • మహాశివరాత్రి (శనివారం, మార్చి 6) — అమృతస్నానం
  • ఫాల్గుణ (సోమవతి) అమావాస్య (సోమవారం, మార్చి 8) — అమృతస్నానం
  • నూతన సంవత్సరం (బుధవారం, ఏప్రిల్ 7)
  • మేష సంక్రాంతి/బైశాఖి (బుధవారం, ఏప్రిల్ 14) — అమృతస్నానం

మేళాలోని మూడు అమృతస్నాన (షాహీ స్నానం) రోజులు ఈ కాలంలోనే వస్తాయి. కుంభమేళాలో శిబిరం నిర్వహించబడినంతకాలం, భక్తుల బసను ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేయడానికి వై.ఎస్.ఎస్. సన్యాసులచే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వీటిలో ఉదయం మరియు సాయంత్రం సామూహిక ధ్యానాలు, కీర్తనలు (భక్తి గీతాలాపన), మరియు సత్సంగాలు ఉంటాయి.

గతంలో జరిగిన ప్రయాగరాజ్ కుంభమేళా యొక్క ముఖ్యాంశాలు

para-ornament

ఒక పుణ్యప్రదమైన అనుభవం

గతంలో ప్రయాగరాజ్ కుంభమేళాలో వై.ఎస్.ఎస్. ఏర్పాటు చేసిన శిబిరాలలో పాల్గొన్న భక్తుల అనుభవాలలో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.

కార్యక్రమం యొక్క వివరాలు

రిజిస్ట్రేషన్

రుసుము చెల్లింపు:

  • రిజిస్ట్రేషన్ ఫీజు ఒక వ్యక్తికి ₹ 2,500. ఇందులో భోజన ఖర్చులు కూడి ఉన్నాయి.
  • మీకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

రిజిస్ట్రేషన్ సమాచారం

ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు మంగళవారం, డిసెంబర్ 1, 2026న ప్రారంభమవుతాయి.

రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

డివోటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్:

భక్తులు త్వరగా మరియు సులభంగా రిజిస్ట్రేషన్ చేయడానికి, వై.ఎస్.ఎస్. డివోటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా రిజిస్ట్రేషన్:

దయచేసి (0651) 6655 555 నెంబరుకు కాల్ చేసి లేదా helpdesk@yssi.org కు ఈ-మెయిల్ చేసి ఈ క్రింది వివరాలు అందజేయండి:

  • మీ పూర్తి పేరు
  • వయస్సు
  • చిరునామా
  • ఈ-మెయిల్ మరియు టెలిఫోన్ నెంబర్
  • వై.ఎస్.ఎస్. పాఠాల రిజిస్ట్రేషన్ సంఖ్య (లేదా ఎస్.ఆర్.ఎఫ్. సభ్యత్వ సంఖ్య)
  • మీ బృందంలోని ఇతర సభ్యుల (ఎవరైనా ఉంటే) వయస్సు మరియు లింగం, అలాగే వారితో మీ బంధుత్వం గురించి తెలపండి
  • మీ ఆగమన మరియు నిష్క్రమణ తేదీలు

మీ మొబైల్ లేదా ఈమెయిల్ చిరునామాకు పంపబడే పేమెంట్ లింక్‌ను ఉపయోగించి మీరు రుసుమును చెల్లించవచ్చు.

ఎస్.ఆర్.ఎఫ్. భక్తుల రిజిస్ట్రేషన్:

  • ఆసక్తి గల ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని ఈమెయిల్ (helpdesk@yssi.org) ద్వారా సంప్రదించి, పైన పేర్కొన్న విధంగా తమ వివరాలన్నింటినీ అందించవలసిందిగా మేము కోరుతున్నాము.
  • ఈ శిబిరంలో వై.ఎస్.ఎస్. నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి, అలాగే అక్కడ భోజన మరియు వసతి సౌకర్యాలను కూడా ఉపయోగించుకోవదానికి ఎస్.ఆర్.ఎఫ్. భక్తులకు స్వాగతం. అయితే, శిబిరంలోని నిరాడంబరమైన వసతి ఏర్పాట్లన దృష్ట్యా, వారు సమీపంలోని హోటళ్లలో తమ సొంత వసతి ఏర్పాట్లను చేసుకోవాలని మేము సూచిస్తున్నాము.

దయచేసి గమనించండి:

  • 12 నుండి 75 సంవత్సరాల మధ్య వయస్సు గల వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు ఈ శిబిరంలో పాల్గొనడానికి అర్హులు.
  • సౌకర్యాలు పరిమితంగా ఉన్నందున, రిజిస్ట్రేషన్లు ముందుగా చేసుకున్నవారికి ముందుగా కేటాయింపు ప్రాతిపదికన నిర్ధారించబడతాయి. మీరు కోరుకున్న తేదీలలో రద్దీ ఎక్కువగా ఉంటే, ప్రత్యామ్నాయ తేదీలు కేటాయించబడవచ్చు.
  • విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత, మీకు ఈ-మెయిల్ లేదా వాట్సప్ లేదా SMS ద్వారా నిర్ధారణ సందేశం వస్తుంది, దానిని మీరు శిబిరానికి వచ్చేటప్పుడు తీసుకురావాలి. ఒకవేళ మీకు అలాంటి నోటిఫికేషన్ రాకపోతే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
  • మీ రిజిస్ట్రేషన్ నిర్ధారించబడిన తర్వాత, మీరు హాజరు కాలేకపోతే, రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లించబడదు లేదా మరొక వ్యక్తికి బదిలీ చేయబడదు.
  • శిబిరం యొక్క సౌకర్యాలు ప్రధానంగా వై.ఎస్.ఎస్. భక్తుల కోసం ఉద్దేశించబడ్డాయి. అయితే, మీ కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మరియు బంధువులు ఎవరైనా మీతో పాటు రావాలనుకుంటే, వారు కూడా రావచ్చు.
వసతి మరియు భోజనాలు

రిజిస్టర్ చేసుకున్న వారికి, వై.ఎస్.ఎస్. శిబిరంలో వసతి నాలుగు రోజులు మరియు మూడు రాత్రులకు మాత్రమే పరిమితం చేయబడింది; ఇందులో మీ ఆగమన మరియు నిష్క్రమణ రోజులు కూడా కలిపి ఉంటాయి. ఈ విధంగా, పరిమితమైన సౌకర్యాలను గరిష్ట సంఖ్యలో భక్తులు ఉపయోగించుకుంటూ తమ స్నానం మరియు ఇతర ఆచారాలను నెరవేర్చుకునేలా చూడవచ్చు.

దయచేసి గమనించండి:

  • శిబిరంలో సౌకర్యాలు పరిమితంగా ఉన్నందున, వై.ఎస్.ఎస్. ద్వారా వసతి నిర్ధారించబడిన వ్యక్తులు మాత్రమే శిబిరంలో బస చేయడానికి అనుమతించబడతారు. అటువంటి నిర్ధారణ లేని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను మీతో పాటుతీసుకురావద్దని మిమ్మల్ని కోరుతున్నాము.
  • పురుషులు మరియు మహిళలకు వేర్వేరు గుడారాలలో వసతి కల్పించబడుతుంది కాబట్టి, కుటుంబాలు దానికి అనుగుణంగా సామాన్లు సర్దుకోవాలని కోరడమైనది.

వసతి సౌకర్యం

శిబిరంలో వసతి ఏర్పాట్లలో భాగంగా, ఇసుకపై వేసిన గుడారాలలో నేలపై గడ్డి పరచబడి, పైన టార్పాలిన్ కప్పబడి ఉంటుంది.

  • మంచాలు, దిండ్లు మరియు కప్పుకునే దుప్పట్లు అందించబడతాయి, కానీ దయచేసి మీ సొంత పరుపు దుప్పట్లు, దిండు గలేబులు (కవర్లు) మరియు స్లీపింగ్ బ్యాగులను తీసుకురండి.
  • హరిద్వార్‌లో మార్చి నెలలో వాతావరణం చాలా వెచ్చగా ఉంటుంది, ఏప్రిల్ నాటికి మరింత వేడిగా మారుతుంది. దయచేసి ఎండ నుండి రక్షణ, తగినంత నీరు త్రాగే ఏర్పాటు, మరియు తేలికపాటి కాటన్ దుస్తులను తీసుకురండి; మార్చి నెలలో తెల్లవారుఝాము కోసం తేలికపాటి శాలువాను కూడా తీసుకురండి. అక్కడి ఉష్ణోగ్రతలు ఇంచుమించుగా ఈ క్రింది విధంగా ఉంటాయి:
    • పగటి సమయం: 25°C–37°C (77°F–99°F)
    • రాత్రి సమయం: 13°C–22°C (55°F–72°F)
  • మీరు రెయిన్‌కోట్ లేదా గొడుగు (ఈ నెలల్లో అప్పుడప్పుడు వర్షం పడే అవకాశం ఉన్నందున), దోమల నివారణ క్రీమ్, టార్చ్, మీ ఆసనం మరియు ఇతర వ్యక్తిగత వినియోగ వస్తువులను కూడా మీతో తెచ్చుకోవచ్చు.

భోజనాలు

అదనపు ఖర్చు లేకుండా భక్తులకు సాధారణ భోజనం ఏర్పాటు చేయబడుతుంది.

దగ్గరలోని హోటళ్లు

కుంభమేళా సమయంలో వసతి లేదా ఆహారానికి సంబంధించి ప్రత్యేక అవసరాలు ఉన్న భక్తులు, దయచేసి సమీపంలోని ఏదైనా హోటల్‌లో తమ సొంత ఏర్పాట్లు చేసుకోవలసిందిగా కోరుతున్నాము. అటువంటి హోటళ్ల జాబితాను డిసెంబర్ నెలలో తెలియజేస్తాము.

ఎలా చేరుకోవాలి

హరిద్వార్ చేరుకోవడం:

  • వాయుమార్గం ద్వారా: డెహ్రాడూన్ (జాలీ గ్రాంట్) విమానాశ్రయం (DED) హరిద్వార్ నుండి 35 కి.మీ. దూరంలో ఉంటుంది.
  • రైలు ద్వారా: ప్రధాన రైల్వే స్టేషన్ – హరిద్వార్ జంక్షన్ (HW).
  • రోడ్డు మార్గం ద్వారా: NH-334 రహదారిపై, ఢిల్లీ నుండి రూర్కీ ద్వారా హరిద్వార్ 210 కి.మీ. దూరంలో ఉంటుంది.

తీర్థస్నానం చేసే ప్రత్యేకదినాలలో:

జనసమూహం అధికంగా ఉండటం వలన, వాహనాల రాకపోకలకు పరిమితులు ఉండి శిబిరానికి నడిచి వెళ్లవలసిన పరిస్థితి రావచ్చు. కాబట్టి, దయచేసి తక్కువ తేలికపాటి సామానుతో రండి.

విచారణ మరియు సంప్రదించాల్సిన వివరాలు

యోగదా సత్సంగ శాఖా మఠం — రాంచీ
పరమహంస యోగానంద పథ్
రాంచీ – 834001
ఝార్ఖండ్

ఫోన్: (0651) 6655 555 (సోమ-శని, ఉదయం 9:00 నుండి – సాయంత్రం 4:30 వరకు)
ఈ-మెయిల్: kumbha@yssi.org

నూతన సందర్శకులు

వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

ఒక యోగి ఆత్మకథ

ఒక అత్యుత్తమ ఆధ్యాత్మిక రచనగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్న తమ పుస్తకం గురించి పరమహంసగారు తరచుగా, “నేను లేనప్పుడు ఈ పుస్తకం నా దూత అవుతుంది,” అనే వారు.

వై.ఎస్.ఎస్. పాఠాలు

మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను సాధించటానికి మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే గృహ-అధ్యయన పాఠ్యక్రమం.

ఇతరులతో పంచుకోండి